టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రీదేవి హీరోయిన్ గా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం ఆఖరి పోరాటం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించగా ... ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ 1988 వ సంవత్సరం మార్చి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల అయ్యి నేటితో 37 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా విడుదల అయ్యి 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.

అశ్విని దత్ , చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమాను చేయాలి అని అనుకున్నాడట. అదే విషయాన్ని రాఘవేంద్రరావుకు చెప్పగా ఆయన కూడా ఓకే అనడంతో ఆఖరి పోరాటం మూవీ కథను రెడీ చేశారట. ఇక ఆ తర్వాత ఆ కథను చిరంజీవికి వినిపించాడట. చిరంజీవి కూడా సినిమా చేద్దాం అన్నాడట. ఇక శ్రీదేవి కూడా సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక అంత ఓకే అయ్యింది ... సినిమాను మొదలు పెడదాం అనుకునే సమయానికి చిరంజీవి ఇతర కమిట్మెంట్ లతో బిజీ కావడం వల్ల నేను ప్రస్తుతం ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో అదే కథను నాగార్జునతో చేయాలి అని మూవీ బృందం డిసైడ్ అయిందట. ఇక ఆ తర్వాత ఆఖరి పోరాటం మూవీ కథను ఈ మూవీ బృందం వారు నాగార్జునకు ఆయనకు ఆ సినిమా కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే ఆ మూవీ లో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో చిరంజీవి కోసం తయారు చేసిన ఆఖరి పోరాటం మూవీ కథను నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: