
అయితే నాగచైతన్య తొలిముద్దు ఎవరికి ఇచ్చారు అనే విషయం పై నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శోభిత పెళ్లి తర్వాత నాగచైతన్య హీరో రానా నిర్వహించినటువంటి ఒక టాక్ షోలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఆ సమయంలో తన తొలిముద్దు అనుభవాన్ని నాగచైతన్య ఇలా తెలియజేస్తూ.. 9వ తరగతిలో ఒక అమ్మాయికి తాను మొట్టమొదటి ముద్దు ఇచ్చారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ ముద్దు తన జీవితాంతం పనిచేస్తుందని విధంగా తెలియజేశారు నాగచైతన్య.
అలాగే ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని ఆ విషయం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిందని తెలిపారు నాగచైతన్య. మొత్తానికి నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తండెల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య తన తదుపరిచిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. నాగచైతన్య సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మంచి పేరు సంపాదించారు. దూత అనే వెబ్ సిరీస్ తో మరింత క్రేజ్ పెంచుకున్నారు నాగచైతన్య. ప్రస్తుతం శోభితతో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య.