తెలుగు సినీ పరిశ్రమ లో తిరుగు లేని దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనిల్ రావిపూడి ఒక రు . ఈయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి మూ వీ తో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండ స్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు . అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ప్రముఖ కమెడియన్ అయినటువంటి సప్తగిరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కమీడియన్లలో ఒకరు అయినటువంటి సప్తగిరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సప్తగిరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ నేను ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా అతను లేడు. అందుకు కారణం అతనే. ఒకానొక సమయంలో నేను ఓ సినిమాకు కథ తయారు చేస్తున్న సమయం లో సప్తగిరి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సినిమాకి కథ రాస్తున్నావా ... నాకు ఏదైనా పాత్ర ఉందా అని అడిగాడు. ఆ తర్వాత అతనే నాకు చిన్న పాత్రలు అస్సలు రాయకు.

సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి పూర్తి అయ్యే వరకు నా పాత్ర ఉండాలి. ఆ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలి. అలాంటి పాత్ర రాయి అని అన్నాడు. ఇక ఇప్పటి వరకు నాకు అంత గొప్ప పాత్ర దొరకలేదు. అందుకే అతను నా సినిమాలో లేడు. సప్తగిరి పెద్ద పాత్ర కాకుండా ఏ పాత్ర అయినా సరే చేస్తాను అని ఉండుంటే ఇప్పటి వరకు నేను దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో ఆయన ఉండేవాడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: