ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీస్ లలో తెలుగు సినిమాలు కూడా చాలానే స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో దక్కించుకున్న టాప్ 10 మూవీస్ లో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి ..? అవి ఏ స్థానాల్లో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరంలో 9.4 మిలియన్ వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకొని ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాల లిస్టులో రెండవ స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

డాకు మహారాజ్ : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

లక్కీ భాస్కర్ : దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 1 మిలియన్ వ్యూస్ దక్కినట్లు , దానితో నెట్ ఫ్లిక్స్ లో ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న సినిమాలలో ఈ మూవీ 9 వ స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: