
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ విడుదలకోసం ఎటువంటి పోటీ లేని ఒక సోలో డేట్ కోసం ఈమూవీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు అని టాక్. ఈసినిమా విడుదలకు జూలై 24 బాగుంటుందనుకుంటే దర్శకుడు మారుతీ లిస్టులో ఆ డేట్ లేదు అని అంటున్నారు. ఈసినిమా ఈసంవత్సరం దసరా కు కానీ లేదంటే దీపావళి కి కానీ విడుదల అయ్యేలా దర్శకుడు మారుతి పక్కా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.
ఈసినిమాలో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ లాంటి బిజీ హీరోయిన్స్ ఉన్న నేపధ్యంలో ఈమూవీ నిర్మాత ఈసినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ తో రోజుకు రెండు మూడు సార్లు కలుస్తూ ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ ను ఎంత త్వరగా పూర్తి చేయాలి అన్నవిషయమై ఈమూవీ నిర్మాతలతో పాటు వారి టీమ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈసినిమా ఫుటేజ్ మూడున్నర గంటలు దాకా రావడంతో ఈమూవీ నిడివిని ఎంతవరకు తగ్గించగలం అన్న ఆలోచనలలో మారుతి ఉన్నట్లు టాక్.
దీనితో ఈ మూవీని ఎడిట్ చేయడం చాల కష్ట సాధ్యంగా మారిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ విడుదల ఈ సంవత్సరం ద్వితీయార్థంలోకి వెళ్ళిపోతుందని అంటున్నారు. అయితే ఆసమయానికి ‘విశ్వంభర’ ‘స్వయంభు’ ‘అఖండ 2’ ‘కాంతారా చాప్టర్ 1’ ‘హరిహర వీరమల్లు’ లాంటి సినిమాలు క్యూలో ఉండటం కూడ ప్రభాస్ ‘రాజా సాబ్’ కు ఊహించని సవాల్ అని అంటున్నారు. దీనితో ఈ కన్ఫ్యూజన్ నుండి ‘రాజా సాబ్’ ఎప్పుడు బయటకు వస్తాడు అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు..