పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి...ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా కు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అయితే ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటం తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది.. మే లో ఈ సినిమాను రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది..

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లకి పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి పార్ట్-2 కూడా రాబోతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది..ప్రస్తుతం పార్ట్-2 స్టోరీపై సుజిత్ వర్క్ చేస్తున్నాడని సమాచారం..ఓజీలో అకిరానందన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. పార్ట్-1 క్లైమాక్స్‌లో అకిరానందన్‌ను ఇంటర్‌డ్యూస్ చేసి పార్ట్-2లో ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్ ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: