
తన బిజీ సెడ్యూల్ ను సర్దుబాటు చేసుకుని ఒక 5రోజులు తన డేట్స్ ఇవ్వగలిగితే ఈమూవీ షూటింగ్ పూర్తి అయిపోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈమూవీ ఏప్రియల్ చివరివారంలో కానీ లేదంటే మే మొదటివారంలో కానీ విడుదల అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే ఆసమయానికి ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న అనేక సినిమాలు పవన్ కోసం లైన్ క్లియర్ చేయవలసి వస్తుంది. ఈ సినిమా విడుదల అయితే తప్ప భారీ అంచనాలు ఉన్న ‘ఓజీ’ విడుదలయ్యే ఆస్కారం లేదు అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి కూడ పవన్ కేవలం వారంరోజులు డేట్స్ ఇస్తే చాలు ఈమూవీ విడుదలకు రెడీ అయిపోతుంది. అయితే ఈరెండు సినిమాలను పవన్ డేట్స్ ఇచ్చినప్పటికీ సమాంతరంగా షూటింగ్ పూర్తి చేయలేని పరిస్థితి.
ఈరెండు సినిమాలలోను పవన్ హైయిర్ స్టైల్ తో పాటు అతడి లుక్ కూడ చాల డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ‘హరి హర వీరమల్లు’ పూర్తి అయిన తరువాత మాత్రమే ‘ఓజీ’ షూటింగ్ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. ఇది ఇలా ఉండగా ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ సినిమాలను ఇప్పటికే ఓటీటీ సంస్థలకు అమ్మడం జరిగింది అని అంటున్నారు. ఈరెండు సినిమాల విడుదల ఆలస్యం అయ్యే కొద్ది ఓటీటీ సంస్థల ఒత్తిడి ఈమూవీ నిర్మాతల పై ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అందువల్ల ‘హరిహర వీరమల్లు’ సమ్మర్ రేస్ కు ‘ఓజి’ దసరా లేదా దీపావళి సీజన్ లో విడుదల అయ్యే ఆస్కారం కనిపిస్తోంది..