
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ డాకూ మహారాజ్. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగినట్టుగా సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి ఏకంగా మూడు పెద్ద సినిమాల పోటీ మధ్యలో రిలీజ్ అయినా కూడా డాకూ కు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక థియేటర్ వసూళ్లు రాబట్టిన సినిమా గా డాకూ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా కు రు. 85 కోట్ల ప్రి రిలీజ్ జిజినెస్ జరిగితే వరల్డ్ వైడ్ గా రు. 175 - 180 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యింది.
ఇక వెండి తెరను షేక్ చేసిన బాలయ్య ఇటు బుల్లి తెర మీద కూడా విజృంభిస్తున్నాడు. తాజాగా ఓటీటీ లోకి వచ్చిన బాలయ్య డాకూ మహారాజ్ సినిమా
మొదటి వార౦లో 27 మిలియన్లు వ్యూస్ సాధించి అదరగొట్టింది. ఇక రెండో వారం లో కూడా 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే 57 మిలియన్లు వ్యూవర్ షిప్ తో బాలయ్య ఓటీటీ లో కూడా దబిడి దిబిడి మోగిస్తున్నాడు. భారతదేశ సినీ చరిత్రలో సీనియర్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పాలి. ఈ సినిమా లో బాలయ్య కు జోడీగా ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్ - చాందిని చౌదరి - ఊర్వశీ రౌతేలా ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఎస్ ఎస్ . థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన జోష్ లో ఉన్న బాలయ్య తన తర్వాత సినిమా ను బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేస్తున్నాడు. అఖండ 2 తాండవం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.