- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సీనియ‌ర్ హీరో .. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుక‌గా భారీ పోటీ మ‌ధ్య‌లో థియేట‌ర్ల లోకి వ‌చ్చిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది. ఏకంగా రు. 303 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు దిమ్మ తిరిగి పోయే షాక్ ఇచ్చింది. క‌నివినీ ఎరుగ‌ని రీతి లో .. కళ్లు చెదిరే వసూళ్లతో ఈ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.


ఇక వెండి తె ర‌ను షేక్ చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్‌లో కూడా వచ్చేసింది. జీ తెలుగు ఛానెల్‌లో మార్చి 1న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో గా టెలీకాస్ట్ అయ్యింది. ఈ సినిమా కు టెలివిజన్ ప్రీమియర్‌లో ఏకంగా 18.1 టీవీఆర్ దక్కినట్లు స‌మాచారం. ఇది మామూలు విజ‌యం కాద‌నే చెప్పాలి. గ‌త రెండేళ్ల‌లో హ‌య్య‌స్ట్ టీవీఆర్ సాధించిన సినిమా గా సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా రికార్డుల‌కు ఎక్కింద‌ని సినిమా యూనిట్ తెలిపింది. అదే రోజున ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చినా కూడా టీవీ లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.


గత ఐదేళ్లలో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన సినిమా ల‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ సినిమా టాప్ ప్లేస్‌లో ఉండగా . . సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు రెండో ప్లేస్ లో నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ అయిన జోష్ లో ఉన్న హీరో వెంక‌టేష్ త‌ర్వాత సినిమా విష‌యం లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: