జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా పేరు సంపాదించారు. ఒక్కో చిత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకోవడమే  కాకుండా అందుకు తగ్గట్టుగా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉన్నారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ కార్లు కలెక్షన్స్ భారీగానే ఉన్నది. అలాగే బైక్స్ వాచెస్ వంటివి కూడా చాలానే ఉన్నాయి


అప్పుడప్పుడు ఎన్టీఆర్ కు చాలా ఖరీదైన గడియారాలు ధరిస్తూ ఉంటారు.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఇటీవలే వచ్చిన ఒక యాడ్లో ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించడంతో చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ సరికొత్త లుక్కులో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర సుమారుగా 8 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ధరించిన వాచ్ రిచర్డ్ మిళ్లే 40-01 టర్బైన్ మెక్ లారెన్ స్పీడ్డయల్ ఆట.


ఈ మోడల్ వాచ్ ప్రపంచంలోనే కేవలం 100 మంది మాత్రమే ఉపయోగిస్తున్నారట.. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఈ వాచ్ చైనాకు సంబంధించింది. ఈ గడియారం అరుదైన యంత్రాంగాన్ని ఉపయోగించి తయారు చేయబడి ఉంటుందట. ఈ గడియారాన్ని తయారు చేయాలి అంటే 3000 గంటలు సమయం పడుతుందట. ఈ గడియారాన్ని చాలా అత్యుత్తమ ఇంజనీర్లు డిజైనర్ల వద్ద సుమారుగా 100 రోజులకు పైగా పనిచేస్తూ ఉంటారట. ఎన్టీఆర్ తెలుగులో దేవర 2 సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నారు.. అలాగే ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఇటీవలే మొదలు పెట్టడం జరిగింది. మరొకవైపు వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: