అసలు పూరి కాంపౌండ్ లో ఏం జరుగుతుంది ? గత కొన్ని సంవత్సరాలగా సరైన విజయం  కోసం ఈ డేరింగ్ దర్శకుడు ఎదురు చూస్తున్నాడు .. టెంపర్ , ఇస్మార్ట్ శంకర్ సినిమాల తర్వాత పూరి దగ్గర నుంచి వచ్చిన సినిమాలని బాక్సాఫీ దగ్గర ఘోరమైన డిజాస్టర్ గా మిగులుతూ వచ్చాయి .. అలాగే పూరి డిజాస్టర్ల వెనక హీరోయిన్ ఛార్మి కూడా కారణమంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు .. చార్మి , పూరి లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ దర్శకుడకు దరిద్రం పట్టుకుందని కూడా అంటారు .. అయితే ఇప్పుడు తెరవనక అసలేం జరిగిందో తెలియదు .. పూరి జగన్నాథ్ - చార్మి విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి ?


విడదీయులేని బంధం కదా వీళ్ళది .. పూరి జగన్నాథ్ సినిమా తీశారు అంటే దానికి నిర్మాతగా చార్మి ఉండాల్సిందే .. ఇప్పుడు కొత్తగా ఈ న్యూస్ ఏంటి ? పూరి జగన్నాథ్ కొత్తగా సినిమాలు ఏం ప్రకటించడం లేదు . అయితే ఆయన ఎవరితో సినిమా చేసిన .. దానికి నిర్మాతగా లేదా కనీసం సహా నిర్మాతకైన చార్మి ఉండటం కామన్ .. అయితే పూరి తర్వాత సినిమా కు మాత్రం ఆమె భాగస్వామ్య ఉండటం లేదని అంటున్నారు .. రీసెంట్గా పూరి జగన్నాథ్ పై కొన్ని కథనాలు , స్టేట్మెంట్స్ వచ్చాయి .. ఇంకా వస్తున్నాయి కూడా .. ఈ డేరింగ్ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవడానికి సిద్ధంగా ఉన్నాడని , చేతిలో మూడు నాలుగు కథ‌లు పెట్టుకుని ఉన్నాడు ..


ఈసారి కచ్చితంగా పూరి క‌థ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం పై మాత్రమే దృష్టి పెట్టబోతున్నాడని .. ఇతర అంశాలేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారంటూ కొందరు చెబుతున్నారు . అయితే దీనికి అర్థం పూరి - చార్మి బంధం తగ్గిపోయినట్లే అని భావిస్తున్నారు చాలామంది .. అయితే ఇలా అనుకుని అలా కట్టేఫ్ చెప్పుకునే బాండింగ్ కాదు వీరిది .. తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి .. లైగర్ బాకీలు ఇంకా గాల్లోనే ఉన్నాయి .. డబుల్‌ స్మార్ట్ కు సంబంధించి కూడా పూరి - చార్మి మధ్య తేలాల్సిన డబ్బులు పంచాయతీ ఏదో ఉందని సమాచారం . ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది వారికే తెలియాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: