టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా సప్తగిరి పలు చిత్రాలలో  నటించి బాగానే పేరు సంపాదించారు. కానీ ఎప్పుడైతే హీరోగా ట్రై చేశారో అప్పటినుంచి ఫెడ్అవుట్ గా మారిపోయారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అడప దడపా చిత్రాలలో నటిస్తూ ఉన్న సప్తగిరి తాజాగా మరొకసారి పెళ్లి కాని ప్రసాదు అనే టైటిల్ తో హీరోగా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గోపిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటిస్తోంది.


తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా కామెడీతో ఈ సినిమా సాగేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.."నాన్న 34 ,36 అంటూ సప్తగిరి తన ఏజ్ ని సైతం చెప్పడంతో ట్రైలర్ మొదలవుతుంది.. తండ్రేమో ఎక్కువ కట్నం కోసం ఆశ పడుతూ ఉంటారు.. అలా పెళ్లికాని ప్రసాద్ గా సప్తగిరి అద్భుతమైన పాత్రలో నవ్వులు పూయించేలా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్లో కొన్ని సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించేలా ఉన్న మరికొన్ని సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా కనిపించడం లేదట.



చివరికి ఫారన్ నుంచి పెళ్లి చేసుకునేందుకు సొంత ఊరికి వచ్చిన సప్తగిరి పెళ్లి కోసం పడ్డ కష్టాలను చూస్తే నవ్వొచ్చేలా కనిపిస్తోంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. ఇందులో రోహిణి, రాంప్రసాద్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. మరి కామెడీ నే నమ్ముకొని మరొకసారి హీరోగా ట్రై చేస్తున్న సప్తగిరికి ఈ సినిమా ఏ విధంగా కలిసేస్తుందో చూడాలి మరి. మరి ఈ సినిమాతోనైనా రాబోయే చిత్రాలలో అవకాశాలు కూడా అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: