బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ అందరికీ తెలుసు. ఈమె నటి, అలాగే మంచి నాట్యకారిణి కూడా. మాధురి దీక్షిత్ తన అందం, అభినయంతో ఎన్నో సినిమాలలో అవకాశాలు పొంది మంచి హిట్ లను అందుకుంది. ఈమెకి అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ అందాల భామ 1984లో అబోద్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో సహాయక పాత్రలో, మరికొన్ని సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించింది. మాధురి దీక్షిత్ రాం లఖన్, పరిందా, త్రిదేవ్, కిషన్ కన్హయ్యా, తేజాబ్ వంటి సినిమాలలో యాక్ట్ చేసింది. ఈ బ్యూటీ 2008లో భారత ప్రభుత్వం ద్వారా పద్మ శ్రీ బిరుదును పొందింది.
 
అయితే తాజాగా నటి మాధురి దీక్షిత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎమ్మెల్యే టికారం జుల్లీ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ మాధురి దీక్షిత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య జైపూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల IIFA 2025 ప్రోగ్రామ్ జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్ కి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అందులో నటులు కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, కత్రినా కైఫ్, రేఖ, కార్తీక్ ఆర్యన్ వచ్చారు. దాని గురించి రాజస్థాన్ ఎమ్మెల్యే టికారం జుల్లీ మాట్లాడుతూ.. జైపూర్ లో జరిగిన ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో తక్కువ మంది బాలీవుడ్ తారలు ఉన్నారని విమర్శించారు. అసలు ఆ కార్యక్రమం వల్ల  రాష్ట్రంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అని ప్రశ్నించారు. వారికి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.


ఆ కార్యక్రమానికి ఎంత మంది పెద్ద స్టార్లు హాజరయ్యారు అని అడిగారు. స్టార్ నటీనటులు ఎవ్వరూ.. కార్యక్రమానికి రాలేదని.. వారేమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లారా అని అన్నారు. షారూఖ్ ఖాన్ తప్ప మరే పెద్ద హీరోలు రాలేదని చెప్పుకొచ్చారు. అందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ వచ్చారని అన్నారు. ఫస్ట్ గ్రేడ్ నటులు ఎవ్వరూ హాజరు కాలేదని చెప్పారు. మాధురి దీక్షిత్ సెకండ్ గ్రేడ్ యాక్టర్ అని వ్యాఖ్యానించారు. ఆమె సమయం అయిపోయిందని అన్నారు. దిల్, బేటా సినిమాలు చేసినప్పుడు ఆమె పెద్ద స్టార్ కానీ ఇప్పుడు కాదని తెలిపారు. అమితాబ్ బచ్చన్ వంటి వాళ్లు రాకపోతే.. మరి ఎవరు వచ్చారు అంటూ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: