
సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను దాటింది. ఇక ఇటీవలే ఈ సినిమా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 12 గంటల్లోనే దాదాపు 13 లక్షల మంది చూశారు. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో రికారర్డులు సృష్టిస్తుంది.
ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా బుల్లితెరపైన కూడా టెలికాస్ట్ అయ్యి అత్యధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. మరోసారి బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యి రికార్డ్ సృష్టించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. మరి ఈ సినిమా ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందని ఆలోచిస్తున్నారా.. ఈ సినిమా 18.1 రేటింగ్ సాధించింది. ఐదు ఏళ్ల కింద పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా 19.12 టీఆర్పీ రేటింగ్ సాధించింది. మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత సంకరంటీకి వస్తున్న సినిమా 18.1 రేటింగ్ నమోదు చేయడంతో.. రెండోవ స్థానంలో నిలిచింది. 310 మిలిజన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జీ5 స్పష్టం చేసింది.