యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తన నటనతో అంచలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ నటిస్తుంది. దిల్ రూబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సరేగమ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి కన్నా నీ అనే లిరికల్ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
 
అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ విశ్వ కరుణ్, హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడారు. ఇక ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా విశ్వని కిరణ్ అబ్బవరం గురించి ఓ ప్రశ్న అడిగింది. కిరణ్ తన ప్రతి సినిమాలో, స్క్రిప్ట్ లో వేలు పెడుతాడు అని టాక్ వినిపిస్తూ ఉంటుందని ఈ సినిమాలో కూడా వేలు పెట్టడా అని అడిగారు.

 
దానికి విశ్వ మాట్లాడుతూ.. 'ఈ సినిమా కిరణ్ అబ్బవరం పేరు మీదనే మార్కెట్ లోకి వెళ్తుంది. ఆయన సినిమాలో ఆయన వేలు పెడితే తప్పు ఏంటి. కిరణ్ రచయిత, అతను ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు. చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాడు. కిరణ్ కి స్క్రిప్ట్ గురించి మంచి అవగహన ఉంది. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చెప్పడం ఆయనకి అలవాటు. ప్రతి సినిమా, ప్రతి కథ కిరణ్ కి చాలా ముఖ్యం. కాబట్టి అతను ప్రతి సినిమా స్క్రిప్ట్ లో వేలు పెడుతూ ఉంటాడు' అని స్వామ్యంగా సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: