బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజుల నుండి మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రెడ్డిట్ లో కూడా అమీర్ ఖాన్ గౌరీ అనే బెంగళూరుకి చెందిన అమ్మాయితో రిలేషన్ లో ఉన్న రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకి కాబోయే మూడో భార్యను పరిచయం చేశారు అమీర్ ఖాన్. ఆయన తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొని గౌరీని పరిచయం చేశారు. ఆ ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్ గౌరీని పరిచయం చేస్తూ ఇలా మాట్లాడారు.. నేను గౌరీని దాదాపు 25 ఏళ్ల క్రితమే కలిశాను. కానీ ఆ మధ్యకాలంలో మా మధ్య దూరం పెరిగి మాటలు కూడా లేవు. కానీ గత 18 నెలల నుండి మా మధ్య రిలేషన్ మళ్ళీ మొదలైంది. 

మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం చూశారా మీ అందరికీ ఈ విషయాన్ని చెప్పకుండా ఎలా దాచానో.. గౌరీకి నేను చాలా స్పెషల్ సెక్యూరిటీని కల్పించాను.ఆమె ఇంటి దగ్గర కూడా హై సెక్యూరిటీని ఉంచాను. గౌరీని నా లైఫ్ కి అనుగుణంగా మార్చుకొని ప్రైవేట్ సెక్యూరిటీని కల్పించాను అంటూ తనకు కాబోయే మూడో భార్య గౌరీని పరిచయం చేస్తూ అమీర్ ఖాన్ ఆసక్తికర కామెంట్లు చేశారు.ఇక అమీర్ ఖాన్ డైరెక్టర్ కిరణ్ రావుని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక కిరణ్ రావుకి ఒక బాబు పుట్టాక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి రెండు సంవత్సరాల క్రితం విడిపోయారు.

అయితే విడిపోయాక కూడా అమీర్ ఖాన్ కిరణ్ రావు ఇద్దరు స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోయే గౌరీది బెంగళూరు. ఆమెకి ఇప్పటికే పెళ్లై విడాకులు అయ్యాయి. అలాగే గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇక గౌరీని కలిసాక  నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్తలు మళ్లీ బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: