
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. ఈటీవీ వీన్ ఓటీటీలో రామం రాఘవం సినిమా మార్చి 14 న విడుదల కానుంది. పరాక్రమం సినిమా కూడా రిలీజ్ కానుంది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా హోలీ పండుగ కానుకగా మార్చి 14న స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ అమెరికన్ మెన్ హంట్ అనే సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. ది ఎలక్ట్రిక్ స్టేట్ అనే హాలీవుడ్ సినిమా, కర్స్ ఆఫ్ ది సెవెన్ సీస్ అనే ఇండొనేషియన్ సినిమా, వనిత అహ్లీ నేరక సినిమాలు మార్చి 14న రిలీజ్ అవ్వనున్నాయి.
అలాగే అమెజాన్ ఫ్రైమ్ ఓటీటీలో వీల్ ఆఫ్ టైమ్ 3 వెబ్ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుండగా.. బీ హ్యాపీ అనే హిందీ సినిమా, బోర్డర్ లైన్ అనే హాలీవుడ్ సినిమా మార్చి 14న విడుదల కానున్నాయి. ఇక ఆపిల్ టీవీ ప్లస్ లో డోప్ థీఫ్ వెబ్ సిరీస్ విడుదల కానుంది. మో ఆనా 2 సినిమా మార్చి 14 నుండి జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. జీ5 ఓటీటీలో ఇన్ గలియోమ్ మే అనే హిందీ సినిమా కూడా మార్చి 14 న ఓటీటీలోకి రానుంది.