ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇక తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.
 
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు హీరోగా నటించిన ప్రేమనగర్ సినిమాలో ఈ బాలుడు కనిపించాడు. ఇప్పుడు ఈ బాలుడు, స్టార్ హీరోగా మారాడు. అతను తన నటనతో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అలాగే మంచి హిట్ సినిమాలు కూడా చాలానే పడ్డాయి. అయితే ఆ బాలుడు లెజెండారీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడు, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఈయన నాగేశ్వర్, నటి వాణి శ్రీ నటించిన ప్రేమనగర్ సినిమాలో వెంకటేష్ చిన్ననాటి కేశవ్ వర్మగా నటించాడు. ఈయన 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.


ఆ తర్వాత వెంకటేష్ మంచి సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటేష్ గా స్క్రీన్ నేమ్ సంపాదించుకున్నాడు. ఈయన సంక్రాంతి, సూర్యవంశం, రాజా, కలిసుందాం రా, గణేష్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, తులసి, మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలలో నటించి ఘన విజయాన్ని సాదిస్తూ..  అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవలే సంక్రాంతికి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: