
ఇక సంతోషం సినిమాలో నాగార్జున కొడుకు లక్కీగా మరో ముఖ్యపాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తున్నాడా.. ఈ బుడ్డోడు సినిమాలో తన నటనతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కామిడీ సీన్స్ లో కూడా అందరినీ భలే నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఈ బుల్లోడు తెగ ఏడ్పించేశాడు. ఈ సినిమాలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ బుడ్డోడు ఎలా ఉన్నాడో చూద్దాం.
లక్కీ పాత్రలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అక్షయ్. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అక్షయ్.. ఇప్పుడు హీరోలా ఉన్నాడు. ప్రస్తుతం అక్షయ్ సినిమాలలో కనిపిస్తున్నాడు. అలాగే పలు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇతను కేవలం నటుడు మాత్రమే కాదు, సింగర్ కూడా.. సింగర్ గా అక్షయ్ కి చాలా మంచి టాలెంట్ ఉంది. ఇతను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన వాంటెడ్ మూవీలో హీరోయిన్ తమ్ముడి పాత్రలో కనిపించాడు. అక్షయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెడుతూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాడు. అలాగే అతను సింగర్ గా పడిన సాంగ్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తాడు.