
అటు అందాల భామ సౌందర్య తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళం సినిమాలలో కూడా నటించింది. ఈమె దాదాపు 100కు పైగా సినిమాలు చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో జాతకట్టింది. ఈమె అమ్మోరు, పవిత్ర బంధం, హలో బ్రదర్, రాజా, అన్నయ్య, శ్వేతనాగు, దేవిపుత్రుడు ఇలా చాలానే సినిమాలు చేసింది. సౌందర్య బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఇటు ఉదయ్ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళం సినిమాలలో కూడా నటించాడు. తెలుగులో వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టడంతో హ్యట్రిక్ హీరో అనే బిరుదు పొందాడు. ఈయన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీ రామ్, నీ స్నేహం, కలుసుకోవాలని, అవునన్న కాదన్న లాంటి సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయిన ఎందుకు చనిపోయాడు అనేది కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా.. అయితే ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నర్తనశాల సినిమాలో నటించారు. ఈ సినిమా బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సౌందర్య ద్రౌపది పాత్రలో నటించగా.. ఉదయ్ కిరణ్ అభిమాన్యుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సౌందర్య ప్రమాదంలో చనిపోయింది. దీన్ని ఎడిట్ చేయగా 17 నిమిషాల పూటేజ్ మాత్రమే వచ్చింది. దాంతో ఆ పూటేజ్ ని 2020లో ఈటీ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ పూటేజ్ లో ఉదయ్ కిరణ్ సీన్స్ ఒక్కటి కూడా లేదు.. కానీ ఆయన కూడా ఆ సినిమా షూటింగ్ లో నటించారు అంట.