కొంతమంది హీరోయిన్లకు కూడా హీరోల మీద, డైరెక్టర్ల మీద క్రష్ అనేది ఉంటుంది. వారికి పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా ఆ హీరోల మీద ఉన్న అభిమానం అస్సలు తగ్గదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కి కూడా అదే పరిస్థితి.ఆ హీరోయిన్ కి పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ చిరంజీవిని మర్చిపోలేక పోతుందట. అంతేకాదు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమతో రూమ్ నిండా చిరంజీవి పోస్టర్లను నింపేసి పడుకునేటప్పుడు కూడా తను పడుకునే దిండు క్రింద చిరంజీవి ఫోటోని పెట్టుకొని పడుకుంటుందట. మరి ఇంతకీ చిరంజీవి అంటే అంత పిచ్చి ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కేవలం మామూలు జనాలే కాదు హీరోయిన్లకు కూడా చిరంజీవి అంటే పిచ్చి. 

అలా స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన వారిలో ఒకరిగా ఉన్న సీనియర్ నటి ఆమనికి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టమట. అయితే చిరంజీవితో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినప్పటికీ ఆయన మీద అపారమైన ప్రేమని అభిమానాన్ని పెంచుకుంది ఆమని. సీనియర్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారంటే చెప్పలేనంత ఇష్టం. మొదట్లో ఆయన మీద ఉన్న ప్రేమతో నా రూమ్ నిండా చిరంజీవి పోస్టర్లను గోడలకు అతికించాను.అంతేకాదు పడుకునేటప్పుడు కూడా నా దిండు కింద చిరంజీవి ఫోటో పెట్టుకునేదాన్ని. అలాగే చిరంజీవితో కలిసి నటించే అవకాశం రెండుసార్లు వచ్చి మిస్ అయింది.

మొదట చిరంజీవితో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలియడంతోనే నేను ఎగిరి గంతేసి మెగాస్టార్ తో నా అనుభవాన్ని పంచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే లోపే నన్ను తప్పించి మరో హీరోయిన్ ని అందులో తీసుకున్నారు. దాంతో చాలా అప్సెట్ అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి నటించిన మరో సినిమాలో కూడా నాకు అవకాశం వచ్చింది.కానీ అది చెల్లెలి పాత్రలో నటించే అవకాశం. ఇక చిరంజీవితో హీరోయిన్ గానే నటించాలి కానీ చెల్లెలి పాత్రలో నటించను అని ఆ సినిమాని రిజెక్ట్ చేశాను.రాంచరణ్ కి అమ్మగా నటించమంటే ఓకే కానీ చిరంజీవికి మాత్రం ఎప్పటికైనా భార్య లేదా లవర్ పాత్రలోనే నటిస్తాను అంటూ ఆమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.మరి ఆమని కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: