
రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా మిగిలిన ఈమె నటనకు మాత్రం బాగానే గుర్తింపు సంపాదించుకుంది. భాగ్యశ్రీ తెలుగు కన్నడలోనే కాకుండా మరాఠీ వంటి భాషలలో కూడా నటిస్తూ తన సినీ కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. అయితే తాజాగా ఈమెకు గాయాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పికిల్ బాల్ ఆడుతూ ఉండగా తన తలకు ఒక గాయమైనట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
హాస్పిటల్ బెడ్డు పైన కనిపిస్తూ చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలను కూడా మన ఇక్కడ చూడవచ్చు. అలాగే తన తలపై బ్యాండేజ్ వేసుకొని నవ్వుతూ తను కోలుకుంటున్న విషయాన్ని తెలియజేసింది నటి భాగ్యశ్రీ. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు మొదట కంగారుపడినప్పటికీ ఆ తర్వాత కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.. టెన్నిస్, బ్యాడ్మింటన్ పోలి ఉండే పికిల్ బాల్ గేమ్ ని సైతం ఆడడానికి కొన్ని రూల్స్ సైతం ఉంటాయట. ఈ ఆటను హీరోయిన్ సమంత కూడా లైక్ చేస్తుందట. అందుకే హైదరాబాదులో కొండాపూర్ పాడిల్ వేవ్ సంస్థ లో ఈ పికిల్ బాల్ కోర్టును సైతం ఏర్పాటు చేయించింది. అయితే ఈ ఆటను ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలట.