
ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమధ్య జరిగిన ఐఫా 2025 అవార్డుల్లో కార్తీక్ ఆర్యన్ కు ‘భూల్ భులాయ్యా 3’మూవీలోని అతడి నటనకు అవార్డు వచ్చింది. ఈసందర్భంగా ఈయంగ్ హీరోని ఇంటర్వ్యూ చేస్తున్న కరణ్ జోహార్ ఈహీరో తల్లిని ఒక ప్రశ్న అడిగాడు. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని అడిగినప్పుడు ఆర్యన్ తల్లి స్పందిస్తూ తమ ఇంట్లో అంతా ఆర్యన్ భార్యగా డాక్టర్ కావాలని అడుగుతున్నారని సమాధానం ఇచ్చింది. దీనితో శ్రీలీల ఈబాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతోంది అంటూ గాసిప్పులు మొదలైపోయాయి.
ఈ గాసిప్పులు బాలీవుడ్ లో కొనసాగుతూ ఉండగానే కొందరు బాలీవుడ్ మీడియా ప్రతినిధులు కార్తీక్ ఆర్యన్ తో ఇంటర్వ్యూ చేస్తూ మీడియాలో వస్తున్న గాసిప్పుల గురించి అతడి దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ఆర్యన్ తెలివిగా స్పందిస్తూ మా అమ్మ కోరుకుంటోంది ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ ని అంతేకానీ సినిమాల్లో నటించే డాక్టర్ కాదని క్లారిటీ కొంతవరకు ఈ యంగ్ హీరో తన పై వస్తున్న గాసిప్పులకు సమాధానం ఇచ్చాడు అనుకోవాలి.
ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్ గా క్రేజ్ ఏర్పరుచుకున్న శ్రీలీల ఇప్పుడు తన దృష్టిని బాలీవుడ్ పై పెట్టి అక్కడ మీడియా సంస్థలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే విపరీతమైన పోటీ ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల నెగ్గుకు రావాలి అంటే ప్రస్తుతం ఆమె కార్తీక్ ఆర్యన్ తో నటిస్తున్న మూవీ సూపర్ హిట్ అయి తీరాలి..