టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ అనేక సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ఈ గ్యాప్ లోనే భీమ్లా నాయక్ , బ్రో అనే సినిమాలను కంప్లీట్ చేసి విడుదల కూడా చేశాడు. ఇక క్రిష్ జాగర్లమూడి "కొండపల్లి" అనే సినిమాను కంప్లీట్ చేసి విడుదల కూడా చేశాడు.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో క్రిష్ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో ఈ సినిమా దర్శకత్వ భాద్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే దానిపై అధికారిక ప్రకటనలను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం హోలీ సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ కు జోడిగా కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: