టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రియదర్శి ఒకరు. ఈయన కమీడియన్ గా కెరియర్ను మొదలు పెట్టి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరో గా నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఈయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడంతో హీరో గా కూడా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రియదర్శి "డార్లింగ్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. డార్లింగ్ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత ప్రియదర్శి "కోర్టు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని నాని నిర్మించాడు. మంచి సినిమాలను ఎంచుకునే ప్రియదర్శిమూవీ లో హీరో గా నటించడం ... మంచి మూవీ లను నిర్మించే నానిమూవీ ని నిర్మించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ని ఈ రోజు అనగా మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను గత రెండు రోజులుగా ప్రదర్శిస్తూ వస్తున్నారు.

మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ వచ్చింది. ఇకపోతే యూ ఎస్ ఏ లో కూడా ఈ మూవీ కి ప్రీమియర్ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు యూ ఎస్ ఏ ప్రీమియర్ షో ల ద్వారా 100 కే ప్లస్ గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: