సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కి చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. అలా మంచి గుర్తింపు వచ్చిన సమయంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా కెరియర్ ముందుకు సాగినట్లయితే వారు స్టార్ హీరోయిన్లుగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో ఏవైనా అనుకోని పరిస్థితులు ఏర్పడి ఓ నటి సినిమాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తే ఆ ముద్దు గుమ్మల క్రేజ్ చాలా వరకు తగ్గి వారు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ముద్దుగుమ్మ ఎదుర్కొంది.

ఆమె మరేవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నబా నటేష్. ఈ నటి నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డిస్కో రాజా సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈమెకు బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. దానితో ఈమెకు వరస పెట్టి తెలుగులో సినిమా అవకాశాలు దక్కాయి. ఈమె కూడా అద్భుతమైన జోష్ లో కెరియర్ను కొనసాగిస్తూ వచ్చింది. అలాంటి సమయంలోనే ఈమెకు ఒక యాక్సిడెంట్ జరిగింది. దానితో కొంత కాలం పాటు నబా నటేష్ సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది.

ఇలా ఈమె యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే ఈమె ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా కెరియర్ అద్భుతమైన దశలో ఉన్న టైమ్ లో ఈమెకు యాక్సిడెంట్ కావడం వల్ల కొంత కాలం పాటు ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం నబా నటేష్ రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: