
ప్రేమించి పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిన అసిన్ ప్రెసెంట్ తన ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. అయితే అసిన్ కి సంబంధించిన వార్తలు అరాకొరా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వినిపిస్తూనే వస్తున్నాయి . కాగా హీరోయిన్ అసిన్ - మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా అయినా పడాలి అని అప్పట్లో ఫ్యాన్స్ బాగా వెయిట్ చేశారు. కానీ ఆ కోరిక తీరకుండానే అసలు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఈ అసిన్. కానీ వీళ్ళ కాంబోని సెట్ చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ టరి చేశారట.
అలా వీళ్ల కాంబోలో రావాల్సిన సినిమాలు మిస్ అయిన డీటెయిల్స్ మరొకసారి ట్రెండ్ అవుతున్నాయి . మహేశ్ కెరియర్ లో ఎన్నో ఎన్నో సినిమాలల్లో నటించాడు . అందులో ఒకటే "ఒక్కడు" మూవీ . ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించింది . అయితే ముందుగా ఈ పాత్రలో హీరోయిన్ గా అసిన్ ని అనుకున్నారట . కానీ అసలు ఈ క్యారెక్టర్ తనకు సూట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసిందట. అప్పట్లో అసిన్ కి అంత పేరు ప్రఖ్యాతలు కూడా లేవు . అలాంటి హీరోయిన్ మహేశ్ సినిమాలో నటించాలి అని కూడా ఆమె అనుకోలేదట. ఆ కారణంగానే ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట . ఆశ్చర్యమేందంటే ఇప్పుడు అదే మహేశ్ సినిమాలు ఆమె చూసి ఎంజాయ్ చేస్తూ బిగ్ ఫ్యాన్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది..!