
ఇక త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో శివరాజ్ కూడా పాల్గొనబోతున్నట్టు టాక్. ఇక చరణ్ 16వ సినిమాలో ఓ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడట .. రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఆటగాడిగా ఇలా రకరకాల ఆటలు వచ్చిన గ్రామీణ యువకుడిగా నటించబోతున్నాడట .. దీంతో రామ్ చరణ్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన పలు సన్నివేశాలని రీసెంట్ గానే షూట్ చేశారు .. ఈ సమయంలో పలువురు ఆకతాయిలో సెల్ ఫోన్ కి పని చెప్పారు .. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో వదిలారు . ఈ వీడియోలో ఒక మైదానంలో చరణ్ క్రికెట్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది ..
ఇక తమ అభిమాన హీరోని క్రికెటర్ గా చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు .. అది షేర్ చేయటమే కాదు ఆ వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు . ఈ సినిమాలో జగతిబాబు , మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు వంటి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు .. ఇక ఏఆర్ రెహమాన్ సంగీత అందిస్తున్నారు .. నిజినికి ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలి నిర్మాతలు భావించారు .. అనుకోని కారణాల వలన సినిమా రిలీజ్ కొత్త ఏడాది 2026 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .