
మరి ముఖ్యంగా వంద రోజులు టార్గెట్ పెట్టుకుంటున్నారు .. ఈమధ్య మజాకా సినిమాని కేవలం 34 రోజుల్లో తీసేసారు దర్శకుడు త్రినాధరావు నకిన.. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా 79 రోజుల్లో పూర్తి చేశారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రికార్డ్ టైంలోనే పూర్తవుతున్నాయి బ్రో సినిమాను కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేస్తారు సముద్రకని .. ఇక ఇందులో పవన్ ఇచ్చిన డేట్స్ కేవలం 22 రోజులు మాత్రమే .. అలాగే దానికి ముందు భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ సైతం కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తయింది .. ఇప్పుడు తాజాగా ఓజీ కోసం ఎక్కువ టైం తీసుకోలేదు పవన్. ఇక రామ్ చరణ్ కూడా తన 16వ సినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు బుచ్చిబాబు .. ఈమధ్య షూటింగ్ మొదలైంది కుదిరితే ఆరు నెలల లోపే టాకీ పూర్తి చేసి డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్.
అలాగే బాలీవుడ్ డబ్ల్యూ మూవీ వార్2 కోసం 70 రోజులు డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ .. ఏ సినిమాకైనా 60 రోజులే.. కావాలంటే 90 రోజులు అంటున్న ప్రభాస్ దీనికి మించి ఒక్కరోజు ఇచ్చేది లేదని కూడా కరాకండిగా చెప్పేస్తున్నారు.. సలార్ , కల్కి లాంటి భారీ సినిమాలనే తక్కువ రోజుల్లోనే తీసేసారు దర్శకులు . అలాగే హను రఘువపూడి సినిమాని కూడా త్వరగానే పూర్తి చేస్తున్నాడు ప్రభాస్ .. స్పిరిట్ కోసం మూడు నెలల బల్క్ డేట్స్ ఇస్తున్నాడు రెబల్ స్టార్ .. రాజమౌళి , సుకుమార్ లాంటి దర్శకులు తప్ప మరి ఏ దర్శకుడికి ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చేందుకు రెడీగా లేరు మన హీరోలు .. ఇది చిత్ర పరిశ్రమకు మంచి విషయమే.