
తాజాగా ఎన్టీఆర్ సినిమాలకు ఇది బాగా వర్కౌట్ అవుతూ వస్తుంది .. దర్శకుల మాయో ఏమో గాని ఈయన సినిమాలకు టైటిల్స్ మాత్రం ఊహించిన రేంజ్ లో ఉంలున్నాయి .. అరవింద సమేత వీర రాఘవ , దేవర, వార్2 ఇలా అన్ని పవర్ఫుల్ టైటిల్సే వస్తున్నాయి . నార్మల్ గా ఎన్టీఆర్ తో సినిమా అన్నప్పుడే టైటిల్ పై ఎంతో ఫోకస్ పెడుతుంటారు దర్శకులు .. కొరటాల సినిమాకు దేవర టైటిల్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఇక ఎప్పుడు ప్రశాంత్ నిల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పటి నుంచి అభిమానులు పండగ చేసుకుంటున్నారు .
అయితే ఇప్పుడు తాజా గా నెల్సన్ సినిమాకు ఇలాంటి టైటిలే ఒకటి పరిశీలిస్తున్నారు .. వార్ 2 , డ్రాగన్ తర్వాత దేవర 2 లైన్ లో ఉంది .. దీని తర్వాత కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ . పాన్ ఇండియా స్థాయిలో ఉండే ఈ సినిమాకు రాక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు కూడా తెలుస్తుంది . ఇలా మొత్తానికి దేవర , డ్రాగన్ , రాక్ ఇలా అన్నీ పవర్ఫుల్ టైటిల్స్ తోనే ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రచ్చ చేయబోతున్నారు.