బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ రోజున 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. తన కెరీర్ కి సంబంధించిన అంశాలతో పాటుగా తన స్నేహితురాలు గౌరీ గురించి మాట్లాడడం జరిగింది. గౌరీ తనకు 25 ఏళ్లుగా సుపరిచితమని ప్రస్తుతం ఆమె బెంగళూరులో నివసిస్తూ ఉన్నదని ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారంటూ తెలియజేశారు. మధ్యలో కొన్నేళ్లు ఆమెతో టచ్లో లేకపోయినా గడిచిన రెండేళ్ల క్రితం మళ్లీ కలుసుకున్నామంటూ తెలియజేశారు.




ఇలా తమ ఇద్దరి మధ్య సుమారుగా 18 నెలల నుంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నామంటూ వెల్లడించడం జరిగింది. ఆమెకు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశానని తెలిపారు అమీర్ ఖాన్. గత రెండు నెలల నుంచి అమీర్ ఖాన్, గౌరీ డేటింగ్ చేస్తున్నట్లు పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి ఈ విషయం పైన తాజాగా అమీర్ ఖాన్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2002లో విడిపోవడం జరిగింది. వీరికి ఇరా అనే సంతానం కలిగింది.


ఆ తర్వాత 2005లో కిరణ్ రావ్ ను అమీర్ ఖాన్ రెండో వివాహం చేసుకోగా 2021లో తన బంధానికి ముగింపు పలికారు. వీరికి ఆజాద్ అనే సంతానం కలిగింది. ఇప్పుడు మూడవ వివాహానికి 60 ఏళ్ల వయసులో సిద్ధమైనట్లుగా హింట్ ఇచ్చారు అమీర్ ఖాన్.. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత్ గురించి తెలియజేస్తూ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నాను ఇందుకు సంబంధించి పనులను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక టీమ్ ను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా వెల్లడించారు అమీర్ ఖాన్. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి విషయాలు తెలియజేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: