తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల శ్రీలీల కూడా ఒకరు .. తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో వరుస‌ అవకాశాలు అందుకుంటూ అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త సైలెంట్ గా మారింది .. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ అంతగా యాక్టివ్గా కనిపించడం లేదు .. ప్రస్తుతం రాబిన్ హుడ్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది .. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది .. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్   సినిమాలోను ఈ బ్యూటీ నటిస్తుంది.. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది .. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో శ్రీలీల నటిస్తుంది .. అయితే ఇదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ ఫిలిం వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది ..


రీసెంట్ గానే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో చేరిన ఫ్యామిలీ పార్టీలో శ్రీ లీల సందడి చేసింది .. అలాగే ఐఫా అవార్డ్స్ వేడుకల్లో తనకు మంచి డాక్టర్ కోడలు కావాలంటూ కార్తీక్ ఆర్యన్ తల్లి కామెంట్ చేయడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది .. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఎక్కువగా శ్రీలీల‌ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు . ఇక‌ శ్రీ లీల 2021 లో ఎంబిబిఎస్ పూర్తి చేసింది .. తల్లి స్వర్ణలత బెంగళూరుకు చెందిన గైనకాలజిస్ట్ .. ఇక శ్రీలీల డ‌చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు విరిపోయారు .. కిస్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శ్రీ లీల .. అలా 14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం  చేసింది ..


అలాగే ఈమెకు భరతనాట్యంలో కూడా ప్రావీణ్యత ఉంది .. 2022లో శ్రీలీల‌ ఒక అనాధ ఆశ్రమానికి వెళ్లి గురు , శోభిత అనే ఇద్దరు వికలాంగు పిల్లలను దత్తత తీసుకుంది .. ఇక వారు మెరుగైన జీవితాన్ని గడపలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటుంది. అలాగే శ్రీలీల మొత్తం ఆస్తులు విలువ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు .. మొదట్లో ఈమె ఒక్కో సినిమాకు గంటకు నాలుగు లక్షలు తీసుకుంది .. అయితే ప్రస్తుతం నాలుగు కోట్ల వరకు అందుకుంటుంది .. అలాగే శ్రీలీల  దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి .. ప్రస్తుతం శ్రీ లీల కార్తీక్ ఆర్యన్  తో కలిసి ఆషికి 3 లో సినిమాలో నటిస్తుంది .. ఈ సినిమాకుఅనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు .. సినిమా 2025 దీపావళికి ప్రేక్షకు ముందుకు రాబోతుందని  టాక్ .

మరింత సమాచారం తెలుసుకోండి: