
శృతిహాసన్ ప్రస్తుతం ఉన్న హీరోలకు హిట్లు అందిస్తుంది అని పేరు తెచ్చుకుంది .. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని పేరు ఉన్న శృతిహాసన్ ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అయిపోయింది .. ఒకప్పుడు ప్లాపుల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ ఇచ్చింది .. ఆ తర్వాత ఆమె క్రేజ్ పెరిగిపోయింది .. గబ్బర్ సింగ్ విజయం ఎక్కువగా శృతిహాసన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది .. ఆమె లక్కీ హీరోయిన్ అయిపోయింది గత ఏడాది వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి సలార్ సినిమా తో ప్రభాస్ కి కూడా హిట్లు ఇచ్చింది .. అలా శృతిహాసన్ ని లెగ్గిస్ట్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులు పిలుచుకుంటున్నారు ..
అయితే ప్రస్తుతం శృతి చేతి లో ప్రభాస్ సలార్ 2 సినిమా తప్ప మరి ఏ సినిమా లేదు .. ఈ విషయం పక్కన పెడితే శృతిహాసన్ గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వేధించాడని అందుకే ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుందన్న ప్రచారం జరిగింది .. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను , కె.ఎస్ రామారావు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమా గురించి అందరికీ తెలిసిందే .. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష సెకండ్ హీరోయిన్ గా కార్తీక నటించారు .. త్రిష కంటే ముందు మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ అనుకున్నారట ..
సినిమా సెట్స్ మీదకు వెళ్ళిన సమయంలో శృతిహాసన్ కి బోయపాటి శ్రీనుకు మధ్య గొడవలు వచ్చి ఈ సినిమా నుంచి శృతిహాసన్ తీసేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది .. ఓ విషయంలో మాట మాట పెరిగిందని చివరకు శృతిహాసన్ తప్పించి ఆ ప్లేస్ లోకి త్రిషను తీసుకున్నారని ప్రచారం జరిగింది .. ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ అయింది .. అయితే దమ్ము నిర్మాత కె ఎస్ రామారావు చాలా ఏళ్ల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయపాటి శ్రీను కి శృతి కి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని .. శృతిహాసన్ వేరే సినిమాలు బిజీగా ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు కాక ఆమెను తప్పించి ఆమె స్థానం లో త్రిషను హీరోయిన్గా తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు ..