
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 7 వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల తో దూసుకుపోతున్నారు .. 2017 లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి గత ఏడాది వచ్చిన దేవర సినిమా వరకు ఎన్టీఆర్ కు తిరుగులేకుండా పోయింది ... అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి .. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ ఇంచనాలు ఉన్నాయి ..
ఈ సినిమా షూటింగ్ మూగిసిన వెంటనే ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి పాన్ ఇండియా సినిమాకు డేట్లు ఇవ్వనున్నారు .. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ దేవర లాంటి బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చే దేవర 2 సినిమా లో నటిస్తారు .. కొరటాల శివ ఈ సినిమా కథ మీద గట్టిగా కసరత్తులు చేస్తున్నారు .. ఈ మూడు సినిమా లు పూర్తయిన వెంటనే .. మరోసారి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఓ సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ..
రాజమౌళి ఎన్టీఆర్ దర్శకత్వం లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి , యమదొంగ , త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చాయి .. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఐదో సినిమా తెరకెక్కనుంది .. రాజమౌళి సినిమా తర్వాత మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా పట్టాలు ఎక్కేందుకు రంగం సిద్ధమవుతోంది .. అలాగే కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ తో ఓ సినిమా రాబోతుంది .. ఇలా ఏది ఏమైనా ఎన్టీఆర్ లైన్ అప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి ..