బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన రాణి ముఖర్జీ ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి.. ఇమే మామ ప్రముఖ నటుడు అయినా దేబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారట. ఈ రోజున పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.
దేబ్ ముఖర్జీ వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలట. ఈయన మరణ వార్త విని పలువురు సినీ సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.


దేబ్ ముఖర్జీ కామిని, తూహి మేరి జిందగీ, అభినయీ తదితర చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. అద్భుతమైన నటనతో పేరు సంపాదించుకున్న ఈ నటుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. సుమారుగా నాలుగు తరాలపాటు బాలీవుడ్ లో ముఖర్జీ కుటుంబం ఏలుతూనే ఉంది. బాలీవుడ్ హీరోయిన్ కాజల్ తో, దేబ్ ముఖర్జీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదట. ఈమెకు వరుసకు మామ కూడా అవుతారట.


దేబ్ ముఖర్జీ కూడా ఎన్నో చిత్రాలలో పనిచేశారు సినీ పరిశ్రమలో అతన్ని దేబు దా అని కూడా పిలుస్తూ ఉంటారట.. దేబ్ ముఖర్జీ మనవడు అయిన కోణార్క్ గోవా రికర్ వివాహం ఈనెల రెండవ తేదీన చాలా గ్రాండ్గా జరిగినప్పటికీ అనారోగ్య సమస్య వల్ల ఈయన వెళ్ళలేకపోయారట వీరి వివాహానికి బాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈయన కుమారుడు అయాన్ ముఖర్జీ సినీ పరిశ్రమ లో డైరెక్టర్ గా  పనిచేస్తున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ,హృతిక్ రోషన్ నటిస్తున్న వా ర్ 2 చిత్రాన్ని కూడా ఈయన తెరకెక్కిస్తున్నారు.దేబ్ ముఖర్జీ తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందడంతో వా 2 సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: