తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ బాగా చేసే హీరోలు ఎవరు అంటే కచ్చితంగా చెప్పే మూడే మూడు పేర్లు చిరంజీవి - అల్లు అర్జున్ - తారక్ . కచ్చితంగా ఈ మూడు పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.  చిరంజీవి తర్వాత అలాంటి కామెంట్స్ దక్కించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు బన్నీ - తారక్ కావడం గమనార్హం.  అల్లు అర్జున్ అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ ఎంత కఠినంగా ఉన్న సింగిల్ టేక్ లోనే దాన్ని ఓకే చేసే విధంగా చేసేస్తారు.  ఆ విషయం అందరికీ తెలిసిందే.  ఆఫ్కోర్స్.. మిగతా హీరోలు కూడా డాన్స్ స్టెప్స్ వేస్తారు . కానీ కొత్త కొత్త డాన్స్ స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేసే విషయంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు తారక్ - బన్నీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


కాగా ఎటువంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేసి స్టైలిష్ స్టార్ బన్నీకే డాన్స్ విషయంలో చెమటలు పుట్టించేసింది ఒక స్టార్ హీరోయిన్ . ఆమె మరి ఎవరో కాదు తమన్న.  అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన సినిమా బద్రీనాథ్ . ఈ సినిమా మంచి విజయం అందుకుంది . ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే డాన్స్ స్టెప్స్ బాగా బాగా ఆకట్టుకున్నాయి.  మరీ ముఖ్యంగా "నాద్..నాద్ బద్రీనాథ్" అనే సాంగ్ లో తమన్నా - అల్లు అర్జున్ ని మర్చిపోయే రేంజ్ లో డాన్స్ స్టెప్స్ వేసింది .



ఇప్పటికీ ఈ పాటను టీవీలో చూస్తున్న యూట్యూబ్లో ప్లే చేసి చూసిన గూస్ బంప్స్ రావాల్సిందే . అంతే కాదు అల్లు అర్జున్ సైతం తమన్నా డాన్స్ స్టెప్స్ ని బీట్ చేయలేకపోయాడు అంటూ జనాలు మాట్లాడుకున్నారు . అల్లు అర్జున్ లాంటి ఒక హీరోకే డాన్స్ విషయంలో చెమటలు పుట్టించిన హీరోయిన్ తమన్నా అంటూ అప్పట్లో తెగపోగిడేసారు . అంతేకాదు అల్లు అర్జున్ కూడా తమన్నా డాన్స్ స్టెప్స్ ను బాగా మెచ్చేసుకున్నారు . మంచి కాంపిటీటివ్గా డాన్స్ చేసింది అంటూ బాగా ఆమెను ప్రశంసించారు . ప్రజెంట్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా విషయంలో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత - జాన్వికపూర్ ని చూస్ చేసుకున్నారు అట్లీ  అలాగే అల్లు అర్జున్ అంటూ టాక్ వినిపిస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: