ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరో గా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ మూవీ విశ్వంభర .. మెగా అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ సినిమా గత సంక్రాంతికే ప్రేక్షకులు ముందుకు రావాల్సింది .. కానీ ఆ సమయంలో గేమ్ చేంజర్ సినిమా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది .. అదే సమయంలో ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మూవీ పై భారీ నెగిటివ్ ఫీలింగ్ తెచ్చిపెట్టింది .. ఇక దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ విషయం లో కాస్త వెనకడుగు వేస్తూ వస్తుంది .. అలా ఈ సినిమా రిలీజ్ విషయం లో వాయిదా పడుతూ వస్తుంది .. అలాగే చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత స్ట్రైట్ సినిమా కావ‌డంతో అలాగే భారీ విజువల్ వండర్ కావడం తో మొదట్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి .


సినిమా టీజర్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కారణం గా షూటింగ్ మళ్లీ చేస్తుండటం , విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా మరోసారి ఫోకస్ పెట్టడం తో విశ్వంభర  మరింత వెనక్కి వెళ్ళింది .. అయితే ఇప్పుడు మే 9 న కొత్త డేట్ గా ఈ సినిమా రావచ్చని టాక్ వినిపించింది .. కానీ ఇప్పుడు  ఈ డేట్ నే ఈ సినిమా రావచ్చని టాక్ వినిపించింది .. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా  ఆ డేట్ నే మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అధికారికం గా అనౌన్స్ అయింది .. ఇక దీంతో ఇప్పుడు విశ్వంభ‌ర పరిస్థితి  ప్రశ్నార్ధకం గా మారింది .. ఇక మరి విశ్వంభర ఎప్పుడు వస్తుంది .. అనేది కాలమే చెప్పాలి  .. అయితే ఈ రెండు సినిమాలకి సంగీతం అందిస్తుంది ఎం ఎం కీరవాణి .

మరింత సమాచారం తెలుసుకోండి: