
సుప్రీత హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే క్రేజ్ పెరిగేలా చేసింది సురేఖ వాణి. త్వరలోనే ఇమే బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి ఒక సినిమాలో నటించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా రాబోతున్నది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సుప్రీత ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు. ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్, యూట్యూబ్ పాపులారిటీ సంపాదించుకున్న వారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే పోలీసులు అరెస్టు చేయడం జరుగుతోంది.
దీంతో పోలీసులు కూడా ఎక్కువగా అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయవద్దు అంటూ అవేర్నెస్ కూడా కల్పించడం కోసం కొన్ని వీడియోలను సెలబ్రెటీల ద్వారా చేయిస్తున్నారు ప్రభుత్వాలు. సోషల్ మీడియా ఇన్ఫ్లోన్సర్ గతంలో తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు అందులో తాను కూడా ఉన్నానని అయితే ఇప్పుడు అన్ని తెలిసి మానేశానని తెలిపింది.ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను నమ్మకండి ఈజీ మనీ వంటి వాటికి అలవాటపడకండి.. బెట్టింగ్ యాప్స్ ని డిలీట్ చేయండి అంటూ ఇకమీదట ఇలాంటి ప్రమోషన్స్ తప్పు చేయను క్షమించండి అంటూ సుప్రీత తెలియజేసింది.