హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు ఎంత హాట్ ఫోటో షూట్ చేసిన ఎవరు వాటిని పట్టించుకోరు .. ఈ విధంగా ఎందుకు చేసావని కూడా ఎవరు క్యూస్షన్ చేయరు .. పైగా అది కెరియర్ కోసం వారికి తప్పట్లేదు ఏమో అందుకే అలా చేస్తున్నారని అంత అర్థం చేసుకుంటారు .. కానీ ఒకసారి పెళ్లయిన తర్వాత కూడా అలాగే హాట్ ఫోటోషూట్ చేస్తే మాత్రం చాలా మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది .. అందులోనూ పెళ్లి చేసుకునేది ఓ పెద్దింటి హీరోను అయితే ఆ హీరోయిన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇక గతంలో సమంత ఇలాంటి సమాధానాలు ఎందరికో చెప్పాల్సి వచ్చింది .. దానికి కారణం  ఆ సమయంలో ఆమె అక్కినేని ఇంటికి కోడలు కావడమే .. పెళ్లికి ముందు హాట్ గా కనిపించిన సమంతను ఎవరు ఏంటి అని ఒక్క ప్రశ్న కూడా చేయలేదు .. కానీ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం సమంత ఫోటో షూట్ చేస్తే అక్కినేని కోడలు ఇలా చేస్తుంది ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
 

అయితే ఇప్పుడు తాజాగా ఇదే పరిస్థితి లావణ్య త్రిపాఠీకి వచ్చి పడింది .. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య .. ఆ తర్వాత దాదాపు డజన్ కు గా సినిమాలో నటించింది .. కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేదు .. కెరీర్ డల్ అవుతుంది అనుకుంటున్నా సమయంలో సంవత్సరం కిందట మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య త్రిపాఠీ .. ఇక పెళ్లికి ముందు ఫోటోషూట్స్ బాగానే చేసిన ఈ ముద్దుగుమ్మ .. మెగా కోడులు అనే ట్యాగ్ వచ్చిన తర్వాత మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వచ్చింది .. సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు .. డిజిటల్ ఇండస్ట్రీలో మాత్రం వెబ్ సిరీస్ లు చేస్తుంది .. అయితే రీసెంట్ గా లావణ్య ఓ  లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది .. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ .. ఈమధ్య సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోషూట్స్ వస్తున్నాయి .. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యేలా కనిపిస్తుంది.
 

మెగా కోడలు మళ్లీ మొదలుపెట్టింది రా బాబు అంటూ లావణ్య ఫోటోషూట్స్ మీద రచ్చ జరుగుతుంది .. ఒకవేళ అవకాశాల కోసం లావణ్య గ్లామర్ షోకు రెడీ అని హింట్ ఇస్తుంది అనుకుంటే .. మెగా కోడలు అనే ట్యాగ్ సర్టిఫికెట్ నిర్మాతలు మర్చిపోవాల్సిందే .. మరోవైపు లావణ్య కు సపోర్టిస్తున్న బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు .. పెళ్లయిన మాత్రన్న ఫోటోషూట్ చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఉండాలా అని వారు ప్రశ్నిస్తున్నారు .. ఇదే క్రమంలో నిహారిక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది . విడాకుల తర్వాత గ్లామర్ షోతో రెచ్చిపోతుంది ఆమెకు లేని కండిషన్స్ లావణ్య కు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు .. ప్రజెంట్ ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా ఉంది .. మరి ఇది రాబోయే రోజుల్లో ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

auto 12px; width:50px;">
View this post on Instagram

A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya)


మరింత సమాచారం తెలుసుకోండి: