బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గత నెలలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగ పాల్గొంటుంది . రీసెంట్ గానే ఈమె తన అత్తగారి తో కలిసి షిరిడి సాయి ఆలయాన్ని కూడా దర్శించింది .. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ మహా కుంభమాలలో పవిత్ర స్నానం  కూడా ఆచరించింది .. అలాగే అక్కడ సాధువులను కలిసి భజన కార్యక్రమాలు కూడా కత్రినా పాల్గొంది .. అయితే ఇప్పుడు తాజాగా కత్రినా కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించింది .. కుటుంబ సభ్యులతో కలిసి సర్ప సంస్కార  పూజలో పాల్గొంది .. సుమారు నాలుగు నుంచి ఐదు గంటలు కత్రినా ఈ పూజలు చేసింది .  అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..

అయితే కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని జంటలకు త్వరలోనే పెళ్లి జరుగుతుందని నమ్మకం .. అలాగే పెళ్లయిన వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు . అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు కత్రినా కూడా ఈ ఆలయాన్ని దర్శించడం , ప్రత్యేక పూజలు చేయడం లాంటివి చూస్తే ఈ బ్యూటీ పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుందని అభిమానులు అంటున్నారు.

బ్యూటీ సినిమాల విషయాని కొస్తే కత్రీనా ప్రస్తుతం ఎలాంటి సినిమాలోను నటించడం లేదు .. చివరగా విజయ్ సేతుపతి సరసన  మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది ..  గత సంవత్సరం రిలీజ్ అయింది .. అయితే ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా కత్రినా 2007 సంవత్సరంలో వచ్చిన నమస్తే లండన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది .  ఇందులో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది .  అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: