టాలీవు డ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటుల లో ప్రియదర్శి ఒకరు . ఈయన పెళ్లి చూపులు మూవీ లో కమెడియన్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు . ఇక ఈ సినిమ మంచి విజయం సాధించడంతో ఈయనకు నటుడి గా మంచి గుర్తింపు వచ్చింది . ఆ తర్వాత వరుస పెట్టి తెలుగులో ఈయనకు అవకాశాలు వచ్చాయి. ఈయన అనేక సినిమాల్లో నటించి చాలా విజయాలను అందుకొని తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో వరసగా ప్రియదర్శి సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన కొంత.కాలం క్రితం బలగం అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈయన కొన్ని రోజుల క్రితం డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. తాజాగా ప్రియదర్శి కోర్టు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు రెండు రోజుల ముందే ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్స్ కి ద్వారా మంచి టాక్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను కొన్ని వారాల థియేటర్ రన్ ను ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: