టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి తాజాగా కోర్టు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని నిర్మించాడు. ఈ మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించడం , నానిమూవీ ని నిర్మించడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో భాగంగా నాని మాట్లాడుతూ .. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా జనాల్ని అలరిస్తోంది.

సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్లయితే మరో కొంత కాలం లో విడుదల కాబోయే నా హిట్ 3 సినిమాను ఎవరూ చూడకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా నాని పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడంతో కచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అని చాలా మంది భావించారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా మార్చి 14 వ తేదీన విడుదల అయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను గత రెండు రోజుల నుండి ఈ మూవీ బృందం వారు ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ వచ్చింది. ఇక ఈ రోజు కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దాదాపు 11 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఏకంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ భారీ టార్గెట్ తోనే బాక్సా ఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ కి ఇప్పటికే హిట్ టాక్ రావడంతో చాలా ఈజీగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: