కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి రష్మిక మందన కాంబినేషన్లో కొంత కాలం క్రితం వారిసు అనే తమిళ సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల చేశారు.

మూవీ తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోగా ... తెలుగు బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే విజయ్ , రష్మిక కాంబోలో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ లో విజయ్ , రష్మిక జంటకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా కంటే ముందే విజయ్ , రష్మిక కాంబోలో ఓ మూవీ రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏది . ? ఎందుకు క్యాన్సల్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం విజయ్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా రష్మిక ను హీరోయిన్గా తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నారట. కాకపోతే ఆ సమయంలో రష్మిక ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో పూజా హెగ్డేను ఈ మూవీ లో హీరోయిన్గా తీసుకున్నారట. అలా విజయ్ , రష్మిక కాంబోలో బీస్ట్ అనే మూవీ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: