టాలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా సినిమాలను నిర్మించి రెండిటిలో కూడా అద్భుతమైన రీతిలో సక్సెస్ అయ్యి ప్రస్తుతం ఓ వైపు డిస్ట్రిబ్యూటర్ గా మరో వైపు నిర్మాతగా ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఇకపోతే దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఒకానొక విషయం గురించి చెబుతూ చిరంజీవి గారి డెసిషన్ సూపర్ అందుకే ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు అని చెప్పుకొచ్చాడు. మరి దిల్ రాజు తాజాగా చిరంజీవి గారి గురించి ఏమీ మాట్లాడాడు అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా దిల్ రాజు చిరంజీవి గురించి మాట్లాడుతూ ... చాలా కాలం క్రితం వాసు వర్మ నాకు జోష్ మూవీ కథను వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. అది చరణ్ తో అయితే అద్భుతంగా ఉంటుంది అని నాకు అనిపించింది. వెంటనే వాసు వర్మను తీసుకు వెళ్లి చిరంజీవి గారికి కథను వినిపించాను. కథ మొత్తం విన్న చిరంజీవి నిర్ణయం మరికొన్ని రోజుల్లో చెబుతాను అన్నాడు. ఆ తర్వాత ఒక సారి చిరంజీవిసినిమా చరణ్ పై వర్కౌట్ కాదు. అది వేరే వాళ్ళతో తీసే ఆలోచన ఉంటే వేరే వాళ్ళతో చెయ్యి అన్నాడు. దానితో నేను కాస్త ఆలోచనలో పడ్డాను. కథలో ఏదైనా ప్రాబ్లం ఉందా .. ఎందుకు చిరంజీవి గారు సినిమా వద్దన్నాడా అని చాలా ఆలోచించారు. కానీ చాలా మంది ఆ కథ సూపర్ ... ఆ కథతో సినిమా చేస్తే మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

ఆ తర్వాత నేను నాగార్జున గారికి ఆ కథను వినిపించి నాగ చైతన్య తో ఆ కథతో సినిమా చేశాను. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. అప్పుడే నాకు అర్థం అయింది. చిరంజీవి గారి డెసిషన్ సూపర్ అని. ఎంతో మంది అద్భుతమైన విజయం అందుకుంటుంది అనుకున్న సినిమా కథను ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసినట్టే ఆ సినిమా ఆడలేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: