టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో హీరో గా నటించి చాలా సినిమాలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అలాగే ఇప్పటి వరకు నాని తన కెరియర్లో కొన్ని సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన సినిమాలలో కూడా చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శైలిష్ కొలను , నాని నిర్మించిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన మొదటగా నాని నిర్మాణంలో రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ని హిందీ లో వేరే బ్యానర్ లో నిర్మించాడు. ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నాని బ్యానర్లో హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాని , విక్టరీ వెంకటేష్ హీరో గా వేరే బ్యానర్ లో సైంధవ్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా స్టైలిష్ ఇప్పటి వరకు కేవలం నాని బ్యానర్లో రూపొందించిన సినిమాలతో మాత్రమే విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శైలేష్ , నాని హీరోగా నటిస్తూ ... నిర్మిస్తున్న హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో శైలేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: