సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో దర్శకుడి తీరు ఒక్కోలా ఉంటుంది. కొంత మంది దర్శకులు హీరోలను ఎక్కువ శాతం రిపీట్ చేయరు. ఒక హీరోతో ఒక సినిమా చేస్తే మళ్ళీ ఆ హీరోతో సినిమా చేయడానికి చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. మరి కొంత మంది అయితే దాదాపుగా హీరోలను రిపీట్ చేయకుండా కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం ఎక్కువ శాతం ఏ హీరోతో పని చేస్తారో అదే హీరోతో పని చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో చందు మొండేటి ఒకరు.

ఈయన నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈయన నాగ చైతన్య హీరో గా రూపొందిన ప్రేమమ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈయన మరో సారి నాగ చైతన్య హీరో గా సవ్యసాచి అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం బ్లడ్ మేరీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ లో విడుదల అయింది.

ఇక ఈ దర్శకుడు కొంత కాలం క్రితం కార్తికేయ 2 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా చందు మండేటి , నాగ చైతన్య తో తండెల్ అనే మూవీ ని రూపొందించాడు. ఇలా ఇప్పటి వరకు ఈయన ఆరు సినిమాలను రూపొందిస్తే అందులో ఐదు సినిమాల్లో కేవలం ఇద్దరు హీరోలను మాత్రమే రిపీట్ చేశాడు. ఈయన నిఖిల్ తో రెండు సినిమాలు చేస్తే నాగ చైతన్య తో ఏకంగా మూడు సినిమాలను చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: