ప్రతి వారం థియేటర్లలో కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని వారాల్లో మాత్రం భారీ ఎత్తున సినిమాలు థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి. దానితో సకటు ప్రేక్షకుడు ఏ సినిమా చూడాలా అనే దానిపై కూడా కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోతూ ఉంటాడు. ఇకపోతే ఈ వారం ఏకంగా థియేటర్లలోకి ఏడు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఆరు కొత్త సినిమాలు కాగా ... ఒకటి రీ రిలీజ్ సినిమా. మరి ఈ వారం థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆరు కొత్త సినిమాలు ..? ఒక రీ రిలీజ్ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ రోజు అనగా మార్చి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రియదర్శి హీరోగా రూపొందిన కోర్టు సినిమా వచ్చింది. ఈ సినిమాను నాని నిర్మించాడు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను గత రెండు రోజులుగా ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ మూవీ ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన దిల్రుబా సినిమా కూడా ఈ రోజు విడుదల అయింది. "క" లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో దాదాపు సక్సెస్ కాలేదు అనే టాక్ వస్తుంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమా కూడా ఈరోజు థియేటర్లలో విడుదల అయింది. క్రైమ్ ఇన్వెస్టిఫికేషన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభిస్తుంది. రాక్షస అనే సినిమా కూడా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఇక 1000 వాలా అనే మూవీ కూడా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ తో పాటు ల్యాంప్ అనే సినిమా కూడా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ ఆరు కొత్త సినిమాలతో పాటు యుగానికి ఒక్కడు సినిమా ఈ రోజు రీ రిలీజ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: