మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరి కొంత కాలం లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్వహించబోతున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం చిరంజీవిసినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం సమ్మర్ నుండి అనిల్ రావిపూడి తో సినిమా స్టార్ట్ కాబోతుంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరో గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం అనిల్ రావిపూడి చాలా సమయాన్ని కేటాయించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే చిరంజీవి సినిమా కథకు సంబంధించిన పనులను అనిల్ రావిపూడి ప్రారంభించాడు. వైజాగ్ లో చిరంజీవి తో చేయబోయే సినిమాకు సంబంధించిన కథ పనులను కొన్ని రోజుల క్రితమే ప్రారంభించిన అనిల్ రావిపూడి చాలా తక్కువ రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ కథను డైలాగ్ వెర్షన్ తో సహా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఈ మూవీ యొక్క సెకండాఫ్ పనులను అనిల్ రావిపూడి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనిల్ రావిపూడి , చిరంజీవి సినిమాకు సంబంధించిన పనులను జెట్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు అని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతున్నారు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: