టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి శర్వానంద్ , అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఇప్పటికే చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే శర్వానంద్ ఆఖరుగా మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అయినా కూడా ఈ మూవీ ఓ టీ టీ లోకి రాలేదు. ఇక ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అయిన తర్వాత కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే అక్కినేని అఖిల్ ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన కొంత కాలానికి ఈ సినిమా సోనీ లవ్ ఓ టి టి లో అందుబాటు లోకి రానున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ చివరి నిమిషంలో ఈ సినిమా సినీ లీవ్ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ కాలేదు. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ అప్డేట్ కూడా ఏది బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ మూవీ ఈ రోజు నుండి సోనీ లీవ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇలా శర్వానంద్ , అఖిల్ నటించిన సినిమాలు విడుదల అయిన తర్వాత చాలా కాలానికి ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: