టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇది ఇలా ఉంటే తారక్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదిలేశాడు. అలా తారక్ వదిలేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకుంటే మరికొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తారక్ వదిలేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లో మొదటగా బోయపాటి శ్రీను , రవితేజ ను కాకుండా తారక్ ను హీరోగా తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్నాక తారక్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో బోయపాటి శ్రీను ఈ మూవీ కథను రవితేజకు వినిపించాడట. రవితేజకు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే కొంత కాలం క్రితం సిద్ధార్థ్ హరో గా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ లో కూడా మొదటగా హీరోగా సిద్ధార్థ్ ను కాకుండా తారక్ ను హీరోగా తీసుకోవాలి అని భాస్కర్ అనుకున్నాడట. అందులో భాగంగా తారక్ కి కథ కూడా వినిపించాడట. ఇక కథ మొత్తం విన్నాక తారక్ కి ఆ స్టోరీ బాగానే నచ్చిన తనపై వర్కౌట్ కాదు అని వేరే వారితో ఈ సినిమా చేయండి అని చెప్పాడట. దానితో సిద్ధార్థ్ తో ఈ మూవీ ని భాస్కర్ రూపొందించగా ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తారక్ తన కెరీర్లో భద్ర , బొమ్మరిల్లు లాంటి రెండు బ్లాక్ బస్టర్ మూవీలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: